Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 7:14 pm Posted by : ramakrishna

ఒకపక్క వర్షాభావ పరిస్థితులు…

 

. . . మరోపక్క ఊపందుకున్న వరి నాట్లు

 

. . . రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న సన్న రకానికి డిమాండ్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో లోటు వర్షపాతం నమోదు అయినప్పటికీ వారి నాట్లు వేయడం మాత్రం ఊపందుకుంది, రాష్ట్ర ప్రభుత్వం సన్న రకానికి బోనస్ అందిస్తున్నామని పేర్కొన్న సన్నం రకం వడ్ల కు డిమాండ్ ఏర్పడింది, దీంతో రైతులు పోటాపోటీగా సన్నరకం వడ్లను పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో లోటు వర్షపాతంతో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం కొట్టుమిట్టాడుతున్న సమయం… అయినా మరో పక్క రైతులు వరి నాట్లు వేయడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇందల్వాయి మండలంలో వరి నాట్లు వేయడం జోరందుకున్నాయి. దీంతో మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల జరిగే నష్టాలకన్నా నేడు జరిగే పనులు మిన్న అనే చందంగా తయారైందని పలువురు రైతులు చర్చించుకుంటున్నారు. ఒకపక్క వర్షాలు లేక కనీసం నారు మడులు పారకపోతే ఎండిపోతున్న దశలో మరోపక్క ఏకంగా వరి నాట్లు వేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నీ నో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా పడే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు ముక్తకంఠంగా హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనీ రైతులు శాస్త్రవేత్తల అభిప్రాయాలను లెక్కచేయకుండా వరి నాట్లు వేయడం కోస మెరుపు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నప్పటికీ రైతులు మాత్రం ఆరు తడి పంటల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనర్వం, భూగర్భ జలాలు అడుగంటి కనీసం త్రాగునీటి కోసం నీరు దొరకని పరిస్థితి ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నప్పటికీ గ్రామీణ ప్రజలు పట్టించుకోకుండా ఏకంగా వరి నాట్లు వేయడం కోసం పోటాపోటీగా కూలీ రేట్లు పెంచేసుకుంటున్నారు. దీంతో కూలీలకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ భవిష్యత్తుపై ఆందోళన కొనసాగుతుంది. పంటలు పండక ఎండిపోతే మాత్రం భవిష్యత్ ఆగమ్య గోచారంగా మారే ప్రమాదం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. రైతులు కనీసం వ్యవసాయ అధికారుల సూచనలు కూడా పాటించకుండా వరినట్లు వేయడం సరికాదని వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని హన్సన్ పల్లి, లోలం, మల్లాపూర్, ఎల్లారెడ్డిపల్లి, ఇందల్వాయి, గన్నారం, తీర్మాన్ పల్లి, గౌరారం, నల్లవెల్లి, సిర్నాపల్లి, చంద్రన్ పల్లీ తదితర గ్రామాలలో వరినట్లు వేయడం జోరందుకున్నాయి, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఎంతో ఉందని ప్రజలు భావిస్తున్నారు.

 

On one hand, drought-like conditions...