Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 2:03 pm Posted by : ramakrishna

డిసెంబర్ 2న ధర్నాకు తరలిరావాలి

సిరికొండ, బతుకమ్మ:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కారంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2న కలెక్టరేట్ వద్ద నిర్వహించతలపెట్టిన అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ధర్నా వ్యవసాయకూలీలు తరలి రావాలని ఏఐకేపీఎంఎస్ నాయకులు ఆర్ రమేశ్, బి బాబన్న పిలుపునిచ్చారు. మండలంలోని రావుట్ల, తూంపల్లిలో సోమవారం ధర్నాకు సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయకూలీల సమస్యల పరిష్కారానికి ఏఐకేపీఎంఎస్ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, ఈ నేపథ్యంలో  సిరికొండ మండల కమిటీ  ఆధ్వర్యంలో రావుట్ల, తూంపల్లి గ్రామాల్లో రెండు బృందాలుగా ఏర్పడి ఐదు రోజులుగా ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి కరువైన  వ్యవసాయ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన  అవసరం ఉందన్నారు. వ్యవసాయ కార్మికులు ఏఐపీకేఎంఎస్ చేపడుతున్న ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజవంతం చేయాలని కోరారు.  ప్రచార కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా, డివిజన్, మండల నాయకులు ఆర్ దామోదర్, బి కిశోర్, జి సాయారెడ్డి, ఈ రమేశ్, ఎం లింబాద్రి, బి బాలకిషన్, ఎస్ కిశోర్, కే ఆశిష్, జె బాల్ రెడ్డి, జె ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.