Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 8:18 pm Posted by : ramakrishna

టీఎన్జీవో పక్షాన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నింటిని తిరిగి శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా టీఎన్జీవో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ , కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్  వినయకృష్ణారెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ, ఉద్యోగ లోకం అణిచివేతకు గురవుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యోగులకు అఖిలభారత ఉద్యోగ సమైక్య జాతీయ ఉపాధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రెటరీ జనరల్  ఏలూరి శ్రీనివాస్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేనీ (ముజీబ్) ప్రత్యేక చొరవతో తెలంగాణా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నింటిని తిరిగి శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, ఉద్యోగుల మనోభావాలను గౌరవించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంమల్లు భట్టి విక్రమార్క కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీఏడి అధికారులకు, ముఖ్యంగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, ఎంప్లాయిస్ జేఏసీ నిజామాబాద్ జిల్లా పక్షాన, టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు జాకీర్ హుస్సెన్ తదితరులున్నారు.

On behalf of TNGO, thanks to the District Collector