Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 12:42 pm Posted by : ramakrishna

8న ట్రస్మా నూతన కార్యవర్గ ప్రమాణం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ట్రస్మా నూతన కార్యవర్గం ఈనెల 8వ తేదీన ప్రమాణం చేయనుందని జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో శుక్రవారం సర్వ సమావేశం నిర్వహిస్తామని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. సమావేశానికి రాష్ర్ట గౌరవ అధ్యక్షుడు కందల పాపిరెడ్డి, కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు హాజరవుతారన్నారు. కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.