నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈనెల 28వ తేదీన కామారెడ్డి జిల్లా ధర్మ యుద్ధ సభలో పాల్గొంటారని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కుంటొల్ల యాదయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తొంట సాయిలు తెలిపారు.ఈ కార్యక్రమానికి మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో జరగబోయే ఈ కార్యక్రమంలో మాదిగ లకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మాదిగ లకు ఉద్యోగాలు రాకుండా మాలలకు భయపడి మాదిగ లను మోసం చేస్తున్న సీఎం పై తాడో పేడో తేల్చుకోవడానికి ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభలను చేపడుతుందని, ధర్మయుద్ధ మహాసభలలో భాగంగా ఈనెల 28న కామారెడ్డి జిల్లాకు మందకృష్ణ మాదిగ వస్తున్నారని ఈ సభకు పెద్ద ఎత్తున మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.