11న ఆర్మూర్ లో బేస్ బాల్ జట్టు ఎంపిక
ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల 11న ఆర్మూర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్ బాల్ జిల్లా సీనియర్ బాలుర జట్టు ను ఎంపిక చేయనున్నట్లు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బి.మల్లేశ్ గౌడ్, అకాడమీ కోచ్ నరేశ్ కి రిపోర్ట్ చేయాలని సూచించారు.