Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 7:47 pm Posted by : ramakrishna

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఓంకార్

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ భీమ్ గల్ మండల్ ప్రెసిడెంట్ గా సున్నపు ఓంకార్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో ఉపాధ్యక్షురాలిగా కొండ్ర విజయ, బాలమణి కార్యదర్శిగా బి. విశ్వనాధం, కోశాధికారిగా పతాని నవీన్, సహాయ కార్యదర్శులుగా మధు, మనోహర్ సలహాదారులుగా గుర్రం చిన్న రాజన్న, పోషన్న, ప్రవీణ్, రఘు , పోశాని, చెప్పాల లక్ష్మి లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గం కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుండి పని చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశం లో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.