Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:23 pm Posted by : ramakrishna

ఓంకార్ శత జయంతి సదస్సును జయప్రదం చేయాలి

 

. . . ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మాజీ శాసనసభ్యులు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ధికాయల ఓంకార్ శతజయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శత జయంతి సభను జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 22న వినాయక్ నగర్ లోని సందీప్ గార్డెన్ లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సంబందించిన కరపత్రాలను శుక్రవారం అమరవీరుల పార్కులో విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, ఎఐఎఫ్డిఎస్ జాతీయ కన్వినర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక ఫ్రంట్ గా ఏర్పడాలని, ఫ్రంట్ ద్వారా చేసే ప్రజా పోరాటాల విస్తృతి ద్వారా ఒకే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడుతోందని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంసిపిఐ(యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గాధగోని రవి, కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, కామ్రేడ్ వనం సుధాకర్, వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు సామాజిక శక్తులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొంగళ్ళ సామేల్, పార్టీ నాయకులు కారంపూరీ ప్రవీణ్ కుమార్, మల్లమారి బిక్షపతి, గణపురం దేవేందర్, దేవులపల్లి తేజ తదితరులు పాల్గొన్నారు.