Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2024, 6:11 pm Posted by : ramakrishna

నగల కోసం వృద్ధురాలిదారుణ హత్య

  • వారం రోజుల్లో మూడు హత్యలు

బతుకమ్మ, బాన్సువాడ : బాన్స్వాడ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో వారం రోజుల్లోనే మూడు హత్యలు చోటుచేసుకున్నాయి. ఒకే రోజు బాన్సువాడ పట్టణంలో కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని ఓ మహిళల ను కొందరు ఇక్కడికి తీసుకు వచ్చి చేతులను, కాళ్ళను తాడుతో కట్టేసి దారుణంగా హత్య చేసి చెరువులో పడేశారు. అదే రోజు బాన్స్వాడ పట్టణంలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని డబ్బు కోసం మరో వ్యక్తి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నుంచి ప్రజలు తేరుకోకముందే, బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భరింగిడిగి శివారులో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కోటగిరి మండలం నాగేంద్రపురం గ్రామానికి చెందిన మాదవ్వ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం సాయంత్రం నగల కోసం హత్య చేసి ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బుధవారం పొలం గట్టుకు వెళ్ళిన ఓ వ్యక్తికి కాల్వ నీటిలో వృద్ధురాలు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచార అందుకున్న బాన్సువాడ సిఐ రాజేష్. బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి హత్యకు గల కారణాలు ఆరా తీశారు. నగల కోసమే తన భార్యను హత్య చేసి ఉంటారని మృతురాలి భర్త శంకర్ బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని బాన్సువాడ సిఐ రాజేష్ వెల్లడించారు.