Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 5:06 pm Posted by : ramakrishna

జైల్లో ఉన్నప్పుడు డబ్బులు సులువుగా సంపాదనకు పాత నేరస్తుల ప్లాన్

 

…జైలు నుంచి విడుదల తర్వాత వ్యక్తి కిడ్నాప్

… రూ.10 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు

… పట్టుకున్న దోమకొండ పోలీసులు.

కామారెడ్డి, బతుకమ్మ :

జైలు జీవితం తో నేరస్థులు మార్చాలి అనుకుంటారు. కానీ జైలు జీవితం వారిలో మార్పు తేకుండా అది కొత్త నేరాలు చేసేందుకు వేదికగా మారుతుంది అంటే అవుననే చెప్పాలి. దోమకొండ  మండలం లో గత అక్టోబర్ నెలలో జరిగిన వ్యక్తి కిడ్నాప్ కేసును  పోలీసులు చిందించగా జైలులో కిడ్నాప్  ప్లాన్, విడుదల తర్వాత అమలు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ…దోమకొండ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్ వరి కోత హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుకుంటూ  జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి అనే పేరుతో ఒక వ్యక్తి  సెల్ పోన్ ద్వార మహేష్ ను పరిచయం చేసుకొని అతని  హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తానని నమ్మించి అక్టోబర్ 22 రాత్రి మాట్లాడుదాం అని పిలిచి కారులో కిడ్నాప్ చేశారు. మార్గమధ్యలో మరో ఇద్దరితో కలిసి బాధితుడి ముఖానికి ఉన్ని టోపీ ని మాస్క్ ల  వేసి, దాడి చేసి, చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కున్నారు. కిడ్నాపర్ లు మద్యం మత్తు లో ఉన్నప్పుడు వారి చెర నుంచి తప్పించుకున్న మహేష్ ఇందల్వాయి బస్‌స్టాండ్‌కు చేరుకొని తన గ్రామస్థులకు సమాచారం అందించాడు. అక్కడి నుండి దోమకొండకు వచ్చి  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Old-time criminals devise a plan to earn money easily while in jail

జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ  మధుసూదన్  పర్యవేక్షణలో భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగడం నరేష్, దోమకొండ ఎస్‌ఐ  ప్రభాకర్  సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.  దర్యాప్తులో బాధితుడు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల పరిశీలన, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలని వేగవంతం చేశారు. మహేష్ మొదటిసారి కిడ్నాప్ సమయంలో తీవ్ర భయాందోళనకు గురై తనకు ఆడ పిల్లలు కలరు తనకు హాని చేయ వద్దు ఎంతైనా డబ్బులు ఇస్తానని చెప్పినందున, అతడిని మరోసారి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని నలుగురు మరో సారి పథకం వేశారు. ఇందులో భాగంగా సోమవారం తిరిగి అదే కారును అద్దెకు తీసుకొని కోనాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద ఉండగా దొమకోండ పోలీసులు కారును అనుమానించి వారిని అదుపులోకి తీసుకొని నిట్టూ నర్సింగరావు, ఎరుగు నగేష్ అలియాస్ నాయేష్, తెడ్డూ సురేష్, చిందం శ్రీకాంత్ లను ను విచారించగా కిడ్నాప్ కేసు విషయం బహిర్గతం అయిందికామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల కు చెందిన నిట్టూ నర్సింగరావు పై భూ వివాదం,హత్యాయత్నం,పేలుడు పదార్థాల కేసు,కిడ్నాప్,ఆయుధాల చట్టం కేసులలో నిందితుడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఎరుగు నగేష్ అలియాస్ నాయేష్ పై తన 9నెలల గర్భవతి గల భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కొనపూర్ కు చెందిన చిందం శ్రీకాంత్ పై దోమకొండ పిఎస్ లో చోరీ కేసులో నిందితుడు. ముగ్గురు నిందితులు జైలు లో ఉన్నప్పుడే సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. వారు జైలు నుంచి విడుదల తరువాత ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన తెడ్డూ సురేష లతో కిడ్నాప్ ప్లాన్ వేశారు.  ఈ క్రమంలో చిందం శ్రీకాంత్‌కు పరిచయమున్న కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్‌ అనే వ్యక్తి దగ్గర  డబ్బు, వ్యవసాయం   అని అతనిని  లక్ష్యంగా ఎంచుకున్నారు. మహేష్ హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుతాడని తెలుసుకొని అదే అదనుతో అతనికి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించి అతడిని కిడ్నాప్ చేసి అదిక మొత్తములో డబ్బు  వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.

Old-time criminals devise a plan to earn money easily while in jail

ఇందులో భాగంగా నిట్టూ నర్సింగరావు కరుణాకర్ రెడ్డి అనే నకిలీ పేరుతో, దొరికిన సిమ్ కార్డ్ ఉపయోగించి సుమారు నెల రోజుల పాటు మహేష్‌తో మాట్లాడి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించాడు. మరోవైపు నిందితులు ముందుగానే బాధితుడి ఇంటి పరిసరాలు, రాకపోకల మార్గాలను పరిశీలించి పతకం ప్రకారం  తెల్లరంగు మారుతి ఎర్టిగా కారును అద్దెకు తీసుకున్నారు. ఈ పథకంలో ఎరుగు నగేష్, నిట్టూ నర్సింగరావు, తెడ్డూ సురేష్ ప్రత్యక్షంగా పాల్గొనగా, చిందం శ్రీకాంత్ గ్రామంలోనే ఉండి బాధితుడి కుటుంబ సభ్యుల కదలికలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాలను గమనిస్తూ వారికి సమాచారం అందించే బాధ్యత తీసుకున్నాడు. అక్టోబర్ 22న  నిందితులు కారులో కోనాపూర్ గ్రామానికి చేరుకొని, హార్వెస్టర్ మిషన్లు చూపిస్తామని చెప్పి మహేష్‌ను వారి దగ్గరకు పిలిచి నమ్మించి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు.  కొంతదూరం వెళ్లిన తర్వాత అతడిని ఉన్ని టోపీని మాస్క్‌లా ఏమి కనపడకుండా తొడిగి కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ రూ.10లక్షలు ఇవ్వాలని  లేదంటే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సు, అందులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కొని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ, బయపెడ్తూ, దాడి చేస్తూ  డబ్బులు తెప్పించాలని ఒత్తిడి చేశారు. అయితే నిందితులు మద్యం సేవించి, ఇందల్వాయి ఒక దభ హోటల్ వద్ద కారు నిలిపి నిద్రలోకి జారుకున్న సమయంలో బాధితుడు వారి చెర నుంచి తప్పించుకొని బస్‌స్టాండ్‌కు చేరుకున్నాడు. ఈ ఘటన అనంతరం నిందితులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఫోన్ చేసి తాము బీహార్‌కు చెందిన వారమని, బాధితుడు తమ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందున అతడిని తీసుకెళ్లి బెదిరించి వదిలిపెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను, గ్రామస్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పోలిసులు సాంకేతిక సమాచారం, సిసి టివి పుటేజీలతో కిడ్నాఫ్ కేసును చెదించి నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా, చేసి వారి వద్ద తెల్లరంగు ఎర్టిగా కార్,నాలుగు సెల్‌ఫోన్స్, మాస్క్ ల ఉపయోగించిన ఉన్ని టోపీ,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును ఛేదించడంలో చురుకుగా పనిచేసిన భిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్  నరేష్, దోమకొండ ఎస్‌ఐ  ప్రభాకర్, కానిస్టేబుల్ సాయిబాబా , బాలకృష్ణ, బైరవప్రసాద్, హోం గార్డ్ శ్రీకాంత్  లను జిల్లా ఎస్పీ  అభినందించారు.