Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 8:31 pm Posted by : ramakrishna

ఓలా బైక్ షోరూం అద్దాలు ధ్వంసం

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : ప్రముఖ విద్యుత్ బైక్ సంస్థ ఓలా పై కస్టమర్ల ఆగ్రహాలు వెలువెత్తుతున్నాయి. బైక్ రిపేర్ కావడంతో దానిని షోరూంలో ఇచ్చేందుకు వచ్చిన కస్టమర్ రెచ్చిపోయారు. కొత్త బైక్ తరచు రిపేర్ కు కావడంతో షోరూం నిర్వాహకులపై మండిపడ్డారు. సోమవారం సాయంత్రం నగరంలోని వినాయక నగర్ లో గల ఓలా బైక్ షోరూం పై రాళ్లు వేసి అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను నానా దుర్భాషలాడారు. మద్యం మత్తులో ఈ తతంగం జరిగినట్టు గుర్తించారు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.