Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2025, 5:53 pm Posted by : ramakrishna

జాతీయ రహదారిపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

 

. . . తప్పిన పెను ప్రమాదం

మెండోరా, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన దానివల్ల ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై ఆదివారం ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది . నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్  బోల్తా పడిన ఘటన చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న మెండోరా ఎస్సై సుహాసిని ఘటన స్థలానికి చేరుకొని వాహనదారుల రాకపోకలు ఇబ్బంది కలగకుండా వాహనాలను దారి మళ్లించి చర్యలు తీసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడిన ఆయిల్ ట్యాంకర్ తీసే విధంగా చర్యలు  చేపట్టారు. ఎలాంటి ప్రమాధం సంబవించకుండా ముందు జాగ్రత్తగా పైర్ ఇంజన్ ను రప్పించారు. అయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ కాకుండా దానిని రహాదారి పై నుంచి తోలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Oil tanker overturns on national highway