భిక్కనూరు, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ఎన్ హెచ్ 44 హైవేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధ రామేశ్వర నగర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న రాజశేఖర్ (35) అనే వ్యక్తి భిక్కనూరు వైపు స్కూటీపై వెళ్తుండగా వెనకాల వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా దావఖాన కు తరలించారు. మృతునికి భార్య మూడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. బిక్కనూర్ పోలిసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
