Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 5:49 pm Posted by : ramakrishna

ఆయిల్ పాం భవిష్యత్ డిమాండ్ పంట

  • ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్ లో అత్యంత డిమాండ్ గల పంట ఆయిల్ పాం పంటనేనని భీమ్ గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని గోన్ గొప్పుల గ్రామంలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయిల్ పాం మొక్కలను నాటి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఆయిల్ పాం పంటను వేసే రైతులకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ద్వారా మొక్కలను, డ్రిప్ లైన్ ను ఇస్తోందని, అందులో ఎస్సీ, ఎస్టీ లకు 100%, ఇతర రైతులకు 90% సబ్సిడీ పై ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ సదాఅవకాశాన్ని రైతులందరు వినియోగించుకోవాలని ఏంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమం లో హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్, అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య, ఏఈఓ మౌనిక, గ్రామ రైతులు పాల్గొన్నారు.