ఆయిల్ పామ్  రైతులకు బైబ్యాక్ ఒప్పంద పత్రాలు అందజేత

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్న రైతులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా గురువారం బైబ్యాక్ ఒప్పంద పత్రాలు అందజేశారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతులకు ప్రీ యునిక్ కంపెనీ తరపున ఈ పత్రాలను అందించారు. లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట సాగుకు ముందుకువచ్చే రైతులకు ప్రభుత్వ సబ్సిడీలతో...