ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపు నిజామాబాద్, బతుకమ్మ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా, సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించారు....