- భయాందోళనలో గ్రామ ప్రజలు
బతుకమ్మ: బిచ్కుంద : కుక్క అనగానే ఆమడ దూరం పరిగెత్తుతారు.. ప్రజలు భయంతో పరిగెడితే వారిని వెంబడించి మరి కరుస్తున్న వైనం ఈ మధ్య గ్రామాల్లో పరిపాటిగా మారింది. ప్రతిగ్రామంలో వీధికి పదుల సంఖ్యలో కుక్కలు రోజురోజుకు పెరిగిపోవడంతో జనాలు ఇండ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక రాత్రివేళలో చెప్పనవసరం లేదు ద్విచక్ర వాహనదారులు నడుచుకుంటా వెళ్లే ప్రజలపైకి వెంబడించి మరి గాయాలపాలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు బిచ్కుంద ప్రాంతంలో సర్వసాధారణంగా మారాయి. బిచ్కుంద మండల కేంద్రంలో ఈ మధ్యకాలంలో కుక్కల బెడద ఎక్కువైంది. గడచిన రోజుల్లో పలుగ్రామాల్లో ప్రజలు, చిన్నపిల్లలు కుక్కకాటుకు గురయ్యారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు కుక్కల నివారణ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామాలలోని ప్రజలు అధికారుల తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కుక్కల బారిన పడి ప్రజల గాయాల పాలవుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పట్ల పలువిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా మున్సిపల్ అధికారులు కుక్కల నివారణ పట్ల శ్రద్ధ వహించి కుక్కల నివారణకు తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.