ఇందల్వాయి, బతుకమ్మ : ఇందాలవాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో పనుల జాతరలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనుల జాతరను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నల్లవెల్లి గ్రామంలో శుక్రవారం పనుల జాతరను నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. హన్సన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, ఇందల్వాయి గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి భరత్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్,ఇందల్వాయి తాండ, కామన్ తండాలలో ఏపీఓ పోశెట్టి, భూమి పూజ నిర్వహించారు.అక్కడక్కడ అంగన్వాడి నూతన భవనాలకు,పశువుల షెడ్డు,ఇంకుడు గుంతలకు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ఇంకుడు గుంతల నిర్మాణం,పశువుల షెడ్డు నిర్మాణం,పౌల్ట్రీ ఫారం (కోళ్ల ఫారం), నిర్మాణం వంటివి నిర్మించుకునేవారు కావలసిన పత్రాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు సూచించారు.ఈ కార్యక్రమంలో అధికార సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.