Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 10:51 pm Posted by : ramakrishna

కందకుర్తిలో వరదలో చిక్కుకున్న 8 మందికి రక్షించిన అధికారుల

బతుకమ్మ, బోధన్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలోని ఓ ఆశ్రమంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో  , రెంజల్ తహసీల్దార్‌తో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సమయానికి స్పందించిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ఆ ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకోవచ్చారు . ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ అందరూ క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే, వర్షాల కారణంగా మరెక్కడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Officials rescue 8 people trapped in floods in Kandakurti