నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించిన అధికారులు

మోర్తాడ్, బతుకమ్మ : కురుస్తున్న భారీ వర్షాలకు మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, పాలెం గ్రామాల మధ్యలో ఉన్న పెద్దవాగు చెక్ డ్యామ్ నీరు ఉదృతంగా ప్రవహించడంతో నీటి ప్రవాహాన్ని మోర్తాడ్ ఎమ్మార్వో కృష్ణ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, మోర్తాడ్ ఎస్సై రాము గురువారం పర్యవేక్షించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున రాకపోకలకు చేయవద్దంటూ ప్రజలకు తెలియజేశారు. ఎవరు కూడా పెద్ద వాగు పరిసర ప్రాంతాలకు వెల్ల వద్దంటూ పేర్కొన్నారు. ఎవరు అటువైపు వెళ్లకుండా రోడ్ మూసి వేయడం జరిగింది. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ...