సన్మానాలకు అలవాటు పడుతున్న అధికారులు
గొర్రె దాటుడు పద్ధతిగా మారుతున్న సన్మానాల కార్యక్రమం బతుకమ్మ, నాగిరెడ్డిపేట : ప్రజా ప్రతినిధులు ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ, అలాగే వారు ప్రజలకు అందించిన ఉత్తమ సేవలను గుర్తిస్తూ కృతజ్ఞత భావంతో వారిని ప్రజలు కానీ, నాయకులు కానీ శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించడం సాంప్రదాయం. కానీ ప్రస్తుతం ఈ సన్మానాల పద్ధతి కాస్త దారి తప్పి గొర్రె దాటుడు పద్ధతిలో ప్రజా ప్రతినిధుల నుండి అధికారుల వరకు పాకిపోయింది. ప్రస్తుతం కొంతమంది అధికారులు నూతనంగా పదవి బాధ్యతలు...