పక్కా సర్వే వివరాల్లో అధికారులు బిజీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన సమగ్ర సర్వే ఆన్‌లైన్ ఎంట్రీ కార్పొరేషన్ కార్యాలయంలో జోరుగా సాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి 75 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 22 మంది మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు సుమారు 7,500 ఆన్‌లైన్ ఎంట్రీలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.