భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు

పొంగుతున్న వాగుల వద్ద ముందస్తు చర్యలు అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో అధికారుల రిక్వెస్ట్ బతుకమ్మ, మాచారెడ్డి: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్న సందర్భంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద స్థాయిలో రోడ్లకు అడ్డంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద ముందస్తు చర్యలు చేపట్టి రోడ్లను మూసేశారు. ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని లొట్టి వాగు, పాల్వంచ వాగు, భవాని పేట వాగు, అక్కాపూర్ లచ్చపేట కాజ్వేలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి వరదల ఉధృతి తగ్గేవరకు ప్రజలు...