పెద్దమ్మతల్లికి బోనం

వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ లో ముదిరాజ్ కులస్తులు తమ ఇలవేల్పు, కుల దైవం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పవిత్ర గంగాజలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులు, బత్తుల బోనాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. పెద్ద మ్మ తల్లికి మహా నైవేద్యాన్ని సమర్పించి హారతి, మంత్ర పుష్పంతో పూజలను నిర్వహించి మొక్కులు చెల్లించుకొన్నారు. బోనాల పండగ సందర్బంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు....