ఉపాధ్యాయురాలికి ‘ఓడీ’ డిప్యుటేషన్
. శాఖలో వెల్లువెత్తుతున్న విమర్శలు . మంత్రి బంధువు కావడమే అర్హతనా..? నిజామాబాద్, బతుకమ్మ: పాఠశాలల పనితీరు, విద్యా సంవత్సరం ఫలితాలు, సిబ్బంది పనితీరును మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టేందుకు ఇవ్వాల్సిన ‘ఓడీ’ డిప్యుటేషన్ ఓ ఉపాధ్యాయురాలికి ఇస్తూ ఏకంగా పాఠశాల విద్య డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ కావడం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. నగరంలోని మారుతినగర్ లో నివాసం ఉండే ఉపాధ్యాయురాలు బోర్గాం(పీ) పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించారు. 2024 – 2025 విద్యా సంవత్సరానికి ఆమెను ముబారక్ నగర్...