- బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దౌర్జన్యం
- అధికారులు తన మాటను కాదనరనే నమ్మకం
- పక్కనున్న ఖాళీ స్థలం ఓనర్లను బెదిరిస్తున్న వైనం
కామారెడ్డి, బతుకమ్మ : ప్రజా ప్రతినిధి అంటే పదిమందికి ఆదర్శంగా ఉంటూ తాను తప్పు చేయకుండా ఇతరులు తప్పు చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధి పై ఉంటుంది. అలాంటి ప్రతినిధులే ఇతరుల స్థలాలను కబ్జా చేస్తూ, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి స్థలం పక్కన ఎంత ఉంటే అంత స్థలాన్ని కబ్జా చేయడమే నేటి ప్రజా ప్రతినిధుల లక్ష్యంగా మారింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు మోహన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పాత రాజు గతంలో గ్రామ సర్పంచ్, ప్రస్తుతం భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ ఓ సామాన్యునికి చెందిన సుమారు 35 గజాల మోరి స్థలాన్ని కబ్జా చేసినట్లు బాధితుడు జనగామ గ్రామానికి చెందిన డాకూరి మోహన్ పేర్కొంటున్నారు. తనకు జనగామ గ్రామంలో 4 – 73 నెంబర్ గల ఇల్లు ఉందని, దాని వెనకాల నుండి గతంలో మద్దూరి కృష్ణారెడ్డి అనే వ్యక్తి మక్క గుడ్డం గుండా నా ఇంటిలో నుండి వృధా నీరు, వర్షపు నీరు వెళ్లేందుకు మోరి ఉండేదని ఒకానొక సమయంలో మద్దూర్ కిష్టారెడ్డి అనే వ్యక్తి ఇందులో నుండి వచ్చే నీటి వల్ల తన పంటకు ఇబ్బంది కలుగుతుందని మోరిని మూసివేయగా నేను వెళ్లి అతనిని బతిమిలాడి అతని వద్ద గజం వెడల్పుతో మోరి కోసం 65 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అట్టి స్థలాన్ని ఆ తర్వాత అక్కడ పాత రాజు భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి స్థలాన్ని కొనుగోలు చేసి దాని పక్కన ఉన్న నా స్థలాన్ని కబ్జా చేసి నేను అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిని నన్ను నువ్వు ఏమి చేయలేవంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. బుధవారం రోజు బివిపేట ఎస్సై సమక్షంలో నాకు స్థలాన్ని అమ్మినటువంటి మద్దూర్ కిష్టారెడ్డి నేను కుమ్మరి మోహన్ కు స్థలాన్ని అమ్మిన మాట వాస్తవమని ఆస్థానం అతనేదేనని చెప్పినా పాత రాజుతో పాటు మరొక డబ్బు గల వ్యక్తి అయినా కుమ్మరి శ్రీనివాస్ అనే వ్యక్తి నా స్థలంలో అక్రమంగా గోడ నిర్మించడమే కాకుండా నన్ను బూతులు సైతం తిట్టడం జరిగింది. వీరిద్దరిపై గ్రామపంచాయతీలో సంవత్సర కాలం నుండి ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం డబ్బు గల వ్యక్తి కుమ్మరి శ్రీనివాస్ ఆ గోడ నిర్మించడం వల్ల నా ఇంటిలో నుండి వర్షపు నీరుతో పాటు వృధా నీరు వెళ్లడం లేదు దీంతో నాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ రాజకీయ నాయకుని పై, డబ్బుందనే అహంకారంతో విర్రవీగుతున్న కుమ్మరి శ్రీనివాసలపై తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ విషయాలపై గురువారం గ్రామ కార్యదర్శి అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.