రైతు నగర్ లో క్షుద్రపూజల కలకలం

బీర్కూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతు నగర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుళ్ళ పోశవ్వ, అనుమవ్వ ఇంటి ఎదుట క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. వీరిద్దరి ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పిండితో చేసిన బొమ్మలు, నిమ్మకాయలు పెట్టి పసుపుతో ముగ్గులు వేశారు. గత వారం రోజులుగా రైతు నగర్ గ్రామంలో కొంతమంది ఇళ్ల ముందు గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో మరొకరి ఇంటి...