Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 9:03 pm Posted by : ramakrishna

భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గతంలో బీసీ స్టడీ సర్కిల్ కొరకు గంగస్థాన్లో స్థలం కేటాయించడం జరిగిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం కాలేకపోయిందని ఆ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించి లేదా కొత్త స్థలం చూసి బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం త్వరతిగతిన చేయించాలని నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో గల బీసీ స్టడీ సర్కిల్ చాలా అద్భుతమైన ఫలితాలతో ప్రభుత్వం నిర్వహిస్తుందని అందులో చదువుకున్న విద్యార్థులందరికీ పై చదువులు మరియు ఉద్యోగాలు సాధించే విధంగా కోచింగ్ ఇస్తున్నారని నరాల సుధాకర్ అన్నారు. ఎన్నో మంచి ఫలితాలను రాబడుతున్న బీసీ స్టడీ సర్కిల్ కు సొంత భవనం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సా ఆంజనేయులు తో కలిసి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి విన్నపం చేశారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ఉన్న ఆరు బీసీ హాస్టల్ లు విద్యార్థులకు సరిపోవడంలేదని విద్యార్థుల సౌకర్యార్థం ఇంకా రెండు బీసీ హాస్టల్లు ఒకటి బాలురకు రెండవది బాలికలకు మంజూరు చేయించాలని విన్నపం చేశారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, కొయ్యడ శంకర్, కరిపే రవీందర్, మడవేడి వినోద్ కుమార్, నల్లగంటి శ్రీలత, బగ్గలి అజయ్, గుత్ప ప్రసాద్, నల్లగంటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.