Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 12:14 pm Posted by : ramakrishna

పెగడపల్లిలో దామర చెరువు తూముల పరిశీలన

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలోని దామర చెరువు కట్టను మరియు తూములను ఇరిగేషన్ ఏఈ సంబంధిత అధికారులు పరిశీలించారు. చెరువులో ఉన్న కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు అందించాలనే దృష్టితో ఈ పరిశీలన చేపట్టబడింది. ఈ సందర్భంగా ఒక తూము రిపేరు అవసరముగా ఉండటంతో, వర్షాకాలం అనంతరం మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్, బోధన్ ఎమ్మార్వో విఠల్, ఎంపీడీవో బాలగంగాధర్, ఆర్.ఇ గంగాధర్, ఇతర సిబ్బంది, గ్రామస్తులు, మాజీ వి.డి.సి చైర్మన్ మేడి రవి, రైతులు లక్ష్మణ్, సాయిబాబా, సాయిలు, భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Observation of the damara pond in Pegadapalli