పౌష్టికాహారం ఎదుగుదలకు ఖచ్చితం

మద్నూర్, బతుకమ్మ: గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు శారీరక మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల అన్నారు. ప్రాజెక్టు పరిధిలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు లెవెల్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రసన్నాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ల మోహన్, ప్రియాంక, మద్నూర్ మండల సిడిపిఓ కళావతి, బాన్సువాడ సిడిపిఓ, మద్నూర్ ప్రాజెక్టు లోని సూపర్వైజర్లు హెల్త్ సూపర్వైజర్లు, మద్నూర్ మండలం ఎంపీడీవో రాణి అంగన్వాడీ టీచర్లు ఆయలు,ఆశా వర్కర్లు లబ్ధిదారులు హాజరయ్యారు.