Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 4:13 pm Posted by : ramakrishna

నేషనల్ క్యారం పోటీలకు నూతికట్టు సతీష్ ఎంపిక

 భీమ్‌గల్, బతుకమ్మ : వచ్చే ఫిబ్రవరి నెల 17 నుండి 22 వరకు నిర్వహించనున్న నేషనల్ లెవల్ క్యారం పోటీలకు భీమ్ గల్ పట్టణానికి చెందిన నూతికట్టు సతీష్ ఎంపికయ్యారు. శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మహారాష్ట్రలోని పూణేలో 2024-25 సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవల్ క్యారం పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి 6 గురు క్యారం సభ్యుల్ని ఎంపిక చేసే ప్రక్రియాలో భాగంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈనెల 23, 24 తేదీల్లో  సెలెక్షన్ పోటీలను నిర్వహించారు. అందులో భీమ్‌గల్ పట్టణానికి చెందిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ క్యారం ప్లేయర్ నూతికట్టు సతీష్ ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల భీమ్ గల్ క్యారం అసోసియేషన్  సీనియర్ క్యారం ప్లేయర్ లు శనివారం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పట్టణ సీనియర్ క్యారం ప్లేయర్ తాహెర్ హుస్సేన్, వెంకట నర్సయ్య, రాజ చంద్రశేఖర్, కంకణాల రాజేశ్వర్ లు సతీష్ ను అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సతీష్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండల ఎంపీడీఓ లో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తూ,నేషనల్ లెవల్ క్యారం పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని అన్నారు. నేషనల్ లెవల్ లో రాణించి  భీమ్‌గల్ పట్టణానికి మంచి గుర్తింపు తీసుకురావాలని వారు కోరారు.