Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:21 pm Posted by : ramakrishna

నూర్జహాన్ ఆశయ సాధనకు కృషి చేయాలి

 

. . . సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్

 

రుద్రూర్,  బతుకమ్మ  :

 

సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ అకాల మృతి కార్మిక వర్గానికి తీరని లోటు అని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. మంగళవారం రుద్రూర్ పీహెచ్ సీలో నూర్జహాన్ సంతాప సభను సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్, ఆశా యూనియన్ రుద్రూర్ మండల కార్యదర్శి వాణి మాట్లాడుతూ, పోరాటానికి మారుపేరు నూర్జహాన్ అని, ఆశా కార్యకర్తల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన పోరాట వనితని కొనియాడారు. నూర్జహాన్ ఆశయ సాధన కోసం ఆమె చూపిన పోరు బాటలో నడుస్తామని తెలిపారు. ఈ సంతాప సభలో వైద్య సిబ్బంది, ఆశా యూనియన్ రుద్రూర్ మండలాధ్యక్షురాలు భూలక్ష్మి, నాయకులు నిర్మల, నాగమణి, రంజన, రాధ, బాలమణి, ఉదయలక్ష్మి, ప్రవళిక, పుష్ప, గంగామణి, మాధవి తదితరులు పాల్గొన్నారు.