38 కి పెరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య

  . . . వేగవంతమైన న్యాయం లక్ష్యంగా కేంద్రం నిర్ణయం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 కి పెంచే బిల్లుకు ఆమోదం లభించింది. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న భారం తగ్గించి, కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు లక్ష పెండింగ్ కేసులు ఉన్నాయని...