- నుడా పరిధిలోకి 380 గ్రామాలు
- నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్
నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధి విస్థరిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ జిఓ 271 ఉత్తర్వులు జారీ చేసారు. గతంలొ నుడా పరిధిలోకి నగర పాలక సంస్థ పరిధిలొ నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్ లతో పాటు 88 గ్రామాలు ఉండేవి. తాజాగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని 380 గ్రామాల వరకు నుడా పరిధిని విస్థరిస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోదన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాల్టిలతో పాటు తాజాగా జిల్లాలోని అన్ని మండలాలను అందులో బాగస్వామ్యం కల్పించారు. నుడా పరిధి విస్థరించడంతో మున్సిపాల్టిలతో పాటు ఖచ్చితంగా డేవలప్ మెంట్ విషయంలో అయా గ్రామాలలో పర్మిషన్ లతో పాటు రూపు రేఖలు మారలంటే ఖచ్చితంగా నుడా అనుమతి తప్పనిసరి. నుడా పరిధి విస్థరించడంతో పాలన పరంగా దానికి పాలక వర్గంలో ఆరు నియోజకవర్గాల వారికి ప్రాధన్యత లభించే అవకాశం ఉంది. నుడా పరిధి విస్థరణను అందరు జిహెచ్ఎంసీతో పోలుస్తున్నారు. నుడా పరిధిలోకి జిల్లాలోని అన్ని మండలాలు రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలలోను దాని ప్రభావం పడనుంది. అందుకు అనుగుణంగా విస్థరణకు నిధులతో పాటు, కోత్తగా వెంచర్ ల ఎర్పాటు , అనుమతులు అన్ని ఖచ్చితంగా నుడా నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగాల్సిందే. ఇటివల పాలకవర్గం చైర్మెన్ గా కేశ వేణును నియమించగా అయన భాధ్యతలు స్వీకరించిన తరువాత ఎల్ఆర్ఎస్ లో నుడా పరిధిని ప్రకటించారు. తాజాగా నుడా పరిధిలోకి జిల్లాలోని మారుమూల మండలాలకు సంబంధించిన ప్రతి గ్రామంను చెర్చడంతో ఇక ముందు డేవలప్ మెంట్ నిర్ణయాలు స్థానిక సంస్థలతో పాటు నుడా రూల్స్ ను పాలో చేయాలసిందే. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గ్రామాలలో పాలన వ్యవహరం అంతా స్థానిక సంస్థలతో పాటు విడిసీల చేతిలో ఉండగా తాజా ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా నుడా అనుమతులు లేకుండా గ్రామాలలో డేవలప్ మెంట్ ఓక్క అడుగు ముందుకు పడదు. రాష్ర్టంలో నిజామాబాద్ నగరం డేవలప్ మెంట్ విషయంలో గ్రీన్ సీటి పరిధిలో ఉండగా స్మార్ట్ సీటిపై ఆశలు పెరిగాయి. కోత్తగా ఎర్పడిన భీంగల్ లాంటి మున్సిపాల్టీ పరిధిలోని నిర్ణయాలకు నుడా తో ముడి వేసి ఉండనుంది. ప్రభుత్వం విస్థరణ వరకేనా ఎమైనా నిధులు ఇస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే కోద్ధిరోజులలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతంది. కాని నగరంతో పాటు, పట్టణాలలో డేవలప్ మెంట్ పడకేసింది. లోకల్ బాడి ఎన్నికలలో నెగ్గుకు రావాలంటే అధికార పార్టి నిధులు విదిల్చాలిసిందే. ఇప్పటివరకు సిడిఎప్ నిధులకు పరిమితమైన ప్రభుత్వం రాష్ర్టంలో హైద్రాబాద్, వరంగల్ తరువాత అతిపెద్ధ నగరం గా ఉన్న నిజామాబాద్ కు అదే విధంగా కోత్తగా విస్థరిస్తున్న నుడాకు ప్రభుత్వం ఎమేరకు నిధులు విడధల చేస్తారో అని చర్చ జరుగుతుంది. నుడా పరిధిలో యూజిడి, మీషన్ భగీరథ, రోడ్ల విస్థరణ, మాస్టర్ ప్లాన్ అనేది దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్నాయి. అందులో ఎ ఓక్కదానిని ఇప్పటివరకు ప్రభుత్వం గ్యారంటిగా ప్రకటించి పనులు చేయడం లేదు. ప్రభుత్వం నుడా పరిధిని విస్థరించి పన్నుల రుపంలో ఖజానా నింపుకుంటుందా లేక నిధుల విధుల్చుతుందా అనేది వేచి చూడాల్సిందే. నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చారు. జిల్లాకు నలువైపుల ఉన్న అన్ని మండలాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చారు. అలూర్ మండలంలోని 7 గ్రామాలు, ఆర్మూర్ 13, బాల్కోండ 11, భీంగల్ 23, బోదన్ 28, చందూర్ 05, ధర్పల్లి 11, డిచ్ పల్లిలోని 10, డోంకేశ్వర్ లోని 12, ఇందల్వాయిలో 10, జక్రాన్ పల్లిలోని 16, వెల్పూర్ లోని 17, ఎడపల్లి 11, వర్ని 12, సిరికోండ 19, సాలురా 10, రుద్రూర్ 10, పోతంగల్ 14, రెంజల్ 9, నవిపేట్ 25, నిజామాబాద్ రూరల్ మండలంలొని సెరిపూర్, మోపాల్ 7, ముప్కాల్ 7 నందిపేట్ 20, కమ్మర్ పల్లి 17, కోటగిరి 20, మాక్లూర్ 13, మెండోరా 8, మోర్తాడ్ 9, మోస్రా 5 గ్రామాలను నుడా పరిధిలోకి తెస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి.