స్లమ్ ఏరియాల్లో పర్యటించిన నుడా చైర్మన్ కేశవేణు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నుడా చైర్మన్ కేశవేణు బుధవారం నగరంలోని స్లమ్ ఏరియాల్లో పర్యటించారు. ఈ సదర్భంగా వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం తీవ్రమైన సమస్యగా మారే అనేక లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఇది చాలా మంది నివాసితుల జీవితాలను ప్రభావితం చేస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఈ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 100 కోట్ల అంచనా బడ్జెట్ ప్రతిపాదించబడిందని అన్నారు. ఈ వర్షాకాలంలో వీలైనన్ని ఎక్కువ పనులను పూర్తి చేయాలని, మిగిలిన లేదా పెండింగ్ పనులు వచ్చే వర్షాకాలం నాటికి...