నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నుడా చైర్మన్ కేశవేణు బుధవారం నగరంలోని స్లమ్ ఏరియాల్లో పర్యటించారు. ఈ సదర్భంగా వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం తీవ్రమైన సమస్యగా మారే అనేక లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఇది చాలా మంది నివాసితుల జీవితాలను ప్రభావితం చేస్తుందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఈ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 100 కోట్ల అంచనా బడ్జెట్ ప్రతిపాదించబడిందని అన్నారు. ఈ వర్షాకాలంలో వీలైనన్ని ఎక్కువ పనులను పూర్తి చేయాలని, మిగిలిన లేదా పెండింగ్ పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ మనోహర్ రెడ్డి, ఏఈ వాజిద్ ఖాన్, రషీద్ ఖాన్ ఉన్నారు.
