Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 4:49 pm Posted by : ramakrishna

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ క్యాంపు, రుద్రూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని బాన్సువాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ మతీన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇందూరు సాయిలు, కోర్బ దత్తు, సురేష్, అనీల్, సుల్తాన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

NTR's death anniversary celebrated with great pomp
NTR’s death anniversary celebrated with great pomp