Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 6:55 pm Posted by : ramakrishna

కోటగిరిలో ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలు

 

కోటగిరి, బతుకమ్మ :

 

కోటగిరి మండల కేంద్రంలో గురువారం నందమూరి తారకరామారావు 103 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు మండల కేంద్రంలోని ఎన్.టి.ఆర్ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

 

NTR Jayanti celebrations in Kotagiri

 

అనంతరం కోటగిరి మండల కేంద్రం మీర్జాపూర్ క్యాంప్ లో మిక్కిలినేని నారాయణమ్మ – మిక్కిలినేని వెంకటరత్నం విరాళంగా ఇచ్చిన స్థలంలో వారి జ్ఞాపకార్థం ఎస్ డిఎఫ్ నిధులు రూ.కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్ ను పోచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, పోతంగల్ మండల నాయకులు,  ప్రజాప్రతినిధులు, ఎన్.టి రామారావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

NTR Jayanti celebrations in Kotagiri