Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 6:19 pm Posted by : ramakrishna

రోడ్డు వెడల్పు కోసం ఎన్ ఎస్ యు ఐ వినతి 

భీమ్‌గల్, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు వెడల్పును పొడిగించాలని కోరుతూ గురువారం ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ,తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎన్ఎస్ యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భీమ్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 12 ఫీట్ల సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు. కళాశాల వెనకాల ఐఐటి, వంద పడగల ప్రభుత్వ ఆసుపత్రి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి  మందిరాలు కూడా ఉండడంతో రవాణాకు 12 ఫీట్ల రోడ్డు సరిపోక,ఉత్సవాలు, కళాశాలల పరీక్షల సమయంలో ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది గురవుతారని అన్నారు. ప్రజల,విద్యార్థుల ఇబ్బందులు తొలగించడానికి మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలను ప్రకారం ఎలాగైతే 30 ఫీట్ల రోడ్డు ఉంటుందో  దాని ప్రకారమే ఈ రోడ్డుని కూడా అదే నిబంధన ప్రకారం వెడల్పు చెయ్యాలని ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ  విద్యార్థి నాయకులు ఈశ్వర్, రిశ్వంత్, వికాస్, హరీష్, విజయ్, శశి, కైఫ్,ఇబ్రహీం, అభినవ్, రోమన్  తదితరులు పాల్గొన్నారు.

NSUI request for road widening