Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2024, 6:36 pm Posted by : ramakrishna

ఎన్ ఎస్ యు ఐ నూతన కమిటీ ఎన్నిక

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా బానోత్ సాగర్ నాయక్, ఉపాధ్యక్షులుగా మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్, నవీన్, కార్యదర్శులుగా అలియాస్, బాలాజీ, కార్యవర్గ సభ్యులుగా అపర్ణ, రమ్య, మధు, గోవింద్ , రాజేందర్, రాజ్ కుమార్, మహేందర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సాగర్ నాయక్ మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం యూనివర్సిటీకి ఎనలేని సేవలు చేశారన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐఅనేది విద్యార్థుల ప్రగతికి అభివృద్ధికి కృషి చేసిందన్నారు.