తెయూ వీసీని కలిసిన ఎన్ఎస్యూఐ నాయకులు

డిచ్ పల్లి, బతుకమ్మ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలకు నూతనంగా ఉప కులపతులను నియమించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమితులైన వైస్ ఛాన్సలర్ ఆచార్య టీ.యాదగిరి రావును ఎన్ఎస్యూఐ వర్శిటీ అధ్యక్షుడు బానోత్ సాగర్ నాయక్ నేతృత్వంలో నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనివర్శిటీ లో నెలకొనియున్న పలు సమస్యలను గురించి వీసికి వివరించారు. అటు ప్రధాన సమస్యలైనా నూతన బాలికల వసతి గృహం,...