Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2025, 6:40 pm Posted by : ramakrishna

ఎన్ఎస్యుఐ నాయకుడిని ఉరితీయాలి

  • ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒడిస్సాలో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఎన్ఎస్యుఐ నాయకుడిని ఉరితీయాలని ఏబీవీపీ  జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ, ఇందూరు విభాగ్ కన్వీనర్ శశి డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఒడిశాలో వరుసగా జరుగుతున్న వివిధ అత్యాచారాలలో ఎన్ఎస్యుఐ నాయకుల హస్తాన్ని నిరసిస్తూ సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుల పేరుతో ఎన్ఎస్యుఐ లీడర్లు అమ్మాయిలను అత్యాచారం చేయటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఎన్ఎస్యుఐI నాయకుల అత్యాచారాలపై రాహుల్ గాంధీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యాచారాలను ప్రోత్సహిస్తుందా…? అత్యాచారాలు చేసే విద్యార్థి నాయకులను ప్రోత్సహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఒడిస్సా రాష్ట్రంలో విద్యార్థి నాయకుల పేరుతో,సేవ అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన ఎన్ఎస్యుఐ ఒడిస్సా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ భువనేశ్వర్ లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసి పోలీసులకు పట్టుపడ్డాడని తెలిపారు. విద్యార్థుల సమస్యలు తీరుస్తా అంటూ విద్యార్థులను దగ్గరికి తీస్తూ ఆడపిల్లలని అత్యాచారం చేయటం ఎంతో దారుణమని అన్నారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాన్ని దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని, త్యాచారంలో, అసాంఘిక పనుల్లో పాల్గొంటున్న ఎన్ఎస్యుఐ నాయకులను ఉరితీసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి, తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్, నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్, ఏబీవీపీ నాయకులు అల్తాఫ్, ఆకాష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.