సుదర్శన్ రెడ్డికి ఎన్ ఎస్ యు ఐ ఘన స్వాగతం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన తర్వాత మొదటిసారి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వినాయక్ నగర్ లోని రుక్మిణి చాంబర్ వద్ద సుదర్శన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన ఎన్ఎస్ యు ఐ నాయకులు అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ, సుదర్శన్ రెడ్డి అనుకూల నినాదాలతో హోరెత్తిస్తూ...