నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన తర్వాత మొదటిసారి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వినాయక్ నగర్ లోని రుక్మిణి చాంబర్ వద్ద సుదర్శన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన ఎన్ఎస్ యు ఐ నాయకులు అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ, సుదర్శన్ రెడ్డి అనుకూల నినాదాలతో హోరెత్తిస్తూ పాత కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీగా వెళ్లారు. అనంతరం సభా వేదికపై సుదర్శన్ రెడ్డి కి ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ ప్రత్యేక మెమొంటో అందజేశారు. ఈ బైక్ ర్యాలీలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయికిరణ్, శివ, నిఖిల్ రెడ్డి, హరీష్, అష్రాఫ, కౌశిక్, అరాఫత్, సునీల్, శశాంక్ ఆర్టీడీ, గంగ ప్రసాద్, గణేష్ రెడ్డి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
