. . . ఎన్.ఎస్.యు.ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వరద బట్టు వేణురాజ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎన్.ఎస్.యు.ఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చి దిద్దుతుందని వరద బట్టు వేణురాజ్ అన్నారు. గురువారం ఎన్.ఎస్.యు.ఐ 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాలలో ఎన్.ఎస్.యు.ఐ జెండా ఎగురవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో, కేరళ విద్యార్థి సంఘం, పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్‌లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్.ఎస్.యు.ఐ ని ఏర్పాటు చేశారని, నేడు ఎన్.ఎస్.యు.ఐ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గా ఉందని ఆయనన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేసి వైస్ ఛాన్స్ లర్ ను అరెస్ట్ చేయించామని, అలాగే బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు సమస్యల పైన ఉద్యమిస్తుంటే అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వెంటబెట్టుకొని బాసర త్రిబుల్ ఐటీ కి తీసుకెళ్లామని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ ఒక్క విద్యార్థి కి సమస్య వచ్చిన వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ విద్యాశాఖ అధికారులతో, ప్రైవేట్ విద్యా సంస్థల లో విద్యార్థులు ఎదుర్కొనే అధిక ఫీజులు, ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున విద్యా రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఎన్.ఎస్.యు.ఐ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులతో, ఎమ్మెల్యేలతో మంచి సత్సంబంధాలు ఉండడమే కాక విద్యారంగ సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుందని, విద్యార్థులు విద్యారంగానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఎన్.ఎస్.యు.ఐ నాయకులను సంప్రదించాలని తెలిపారు. తాము ప్రభుత్వంలోని పెద్దలతో గాని సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని అలాగే ఎన్.ఎస్.యు.ఐ బలోపేతం కోసం ప్రతి ఒక్క విద్యార్థి ఎన్.ఎస్.యు.ఐ లో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నాయకులు సాయి కిరణ్ రెడ్డి, శివ, హరీష్, కౌశిక్, శివ, గణేష్ రెడ్డి, కనకరాజ్, మనీష్, దినేష్, గిరిర్రాజ్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులు వికాస్, రాహుల్, చిన్నయ్య, అభిలాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.