- ఎన్ ఎస్ యు ఐ నాయకులు దత్తాద్రి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్ఎస్ యు ఐ విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు దత్తాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ ఎప్పుడు విద్యార్థిని నిరుద్యోగులు పక్షాన పోరాటం చేస్తుందని, విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి ఎన్ ఎస్ యు ఐ నాయకులు పోరాడి ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు విద్యార్థులకు అండగా నిలబడతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలామంది నాయకులు ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నుండి రాష్ట్ర జాతీయ నాయకులుగా ఎదిగారని, కాంగ్రెస్ పార్టీలో ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగానికి ప్రత్యేక స్థానం ఉంటుందని దానికి కారణం ఎం ఎస్ యు ఐ నాయకులు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని సమాజంలోని పలు రకాల సామాజికరాజకీయ అంశాలపై అవగాహన పెంచుకొని ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యలపై పోరాటం చేస్తారని ఆయన అన్నారు. ఎన్ ఎస్ యు ఐ అనేది క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంఘం అని దీనిలో నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో సమర్థవంతంగా పనిచేసినవారు జీవితంలో వారు ఏ రంగానికి వెళ్లిన అందులో రాణిస్తారని ముఖ్యంగా రాజకీయాలలోకి రావాలనుకునేవారు యుక్త వయసులోనే విద్యార్థి దశ నుండి నాయకత్వం లక్షణాలను ఎన్ ఎస్ యు ఐ నేర్పిస్తుందని ఆయన అన్నారు. దేశంలో అనేక రకాల విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై ఎన్ ఎస్ యు ఐ అలుపెరగకుండా పోరాటం చేస్తుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు నిరుద్యోగులకు మధ్య ఎం ఎస్ యు ఐ వారధి లా నుండి విద్యార్థి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించిందని ప్రస్తుతం రాష్ట్రంలో కూడా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహిస్తూ విద్యార్థి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఎన్ ఎస్ యు ఐ కృషి చేస్తుందని ఆయన అన్నారు.