Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 7:53 pm Posted by : ramakrishna

ఎన్ఎస్ఎస్ సేవలు అమోఘం

  •  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

ఇందూర్, బతుకమ్మ: గ్రామీణ ప్రాంతాలలో చేస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అమోఘమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కొనియాడారు. గిరిరాజ్ కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్  అధికారి, డాక్టర్ ఇప్ప వెంకటరమణరెడ్డి నేతృత్వంలో నిజామాబాద్ మండలంలోని ఆకుల కొండూరులో గత వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలను వాలంటీర్ల చేత నిర్వహిస్తున్నారు.  కొండూరుకు మంగళవారం విచ్చేసిన ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రధానం చేసారు. ముందుగా ఆరు రోజులుగా గ్రామంలో చేసిన పనులను విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాబ్యాసం పూర్తయ్యాక మంచి పనులు చేస్తూ ప్రజల మన్నలను పొందాలని సూచించారు. వాలింటీర్ల సేవలను  ప్రశంశించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.