Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 7:53 pm Posted by : ramakrishna

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు

ఎల్లారెడ్డి, బతుకమ్మ:ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో క్యాంపు హాజీపూర్ తాండ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్యాంపులో పరిసరాల శుభ్రత, క్యాంపులో సర్వే, మొక్కల పెంపకం లాంటి ప్రోగ్రాం నిర్వహించుకొని చక్కనైనా గ్రామంగ తీర్చిదిద్దాలని తెలిపారు. క్యాంపు మొదటి రోజు భాగంగా కళాశాల విద్యార్థులు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయడం జరిగింది అని ఎన్ఎస్ఎస్ పీఓ యూనిట్:I ఇన్చార్జి అయిన చంద్రకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకాంత్, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ శంకరయ్య, ఐ టీఎస్ కేసి ఇన్చార్జ్ శివ కుమార్ అధ్యాపకులు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.