Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 9:20 pm Posted by : ramakrishna

రామాలయంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ప్రత్యేక పూజలు

రుద్రూర్, బతుకమ్మ : శ్రీ రామ నవమిని పురస్కరించుకుని వర్ని, అక్బర్ నగర్ గ్రామంలోని రామాలయాల్లో ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుద్రూర్ గ్రామంలోని గోశాలకు 50 మోపుల గడ్డిని వితరణ చేశారు. వర్ని మండలంలోని జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబును మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయి తినిపించడం జరిగింది. కోనేరు శశాంక్ చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల బిజెపి అధ్యక్షులు అలంపాటి హరికృష్ణ, బీజేపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.