Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 4:23 pm Posted by : ramakrishna

1,00,116 లడ్డును కైవసం చేసుకున్న ఎన్ఆర్ఐ కౌడప్ శత్రుత్ పటేల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తొమ్మిది రోజుల పాటు లాంభోదరుని వద్ద పూజలందుకున్న లడ్డును రూ.1,00,116కు ఎన్ ఆర్ ఐ కౌడప్ శత్రుత్ పటేల్ కైవసం చేసుకున్నారు. శనివారం నగరంలోని నాందేవ్ వాడలోని శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో భారీ ధరకు రూ.1,00,116కు ఎన్ఆర్ఐకి చెందిన కౌడప్ శత్రుత్ పటేల్ సొంతం చేసుకున్నాడు. నిజామాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కౌడప్ శరత్ పటేల్, ఉమా దంపతుల కుమారుడు కౌడప్ శత్రుత్ పటేల్ గణపతి లడ్డు సొంతం చేసుకున్నాడు. విదేశాల్లో ఉంటూ తమ దేశంలో జరిగే అతి పెద్ద పండుగ అయినా గణనాధుపై భక్తితో లడ్డును వేలంలో కొనుగోలు చేయడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కొనుగోలు చేసిన లడ్డును తమ బంధువులతో పాటు తాను స్థిరపడిన అమెరికాలోని  తన స్నేహితులకు పంచుతానని కౌడప్ శత్రుత్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శివపుత్ర యూత్ నిర్వాహకులు కందికంటి నరేందర్ గౌడ్, కిషోర్ గౌడ్, సుధీర్ గౌడ్, శ్యామ్ గౌడ్, బింగి శుభం, బబిత్  గౌడ్, రాహుల్ బాసరి, కిరణ్ గౌడ్, సాయినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

NRI Kaudap Shatruth Patel wins 1,00,116 laddus